కడప కొప్పర్తి రోడ్డు నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు
రిపోర్టర్: మహేష్
స్థలం: కడప
కడప జిల్లాలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్‌ను బైపాస్‌తో అనుసంధానించే కొత్త రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.304.44 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధి ఊపందుకుని, స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.