'ప్రతి ఇంటి వద్ద దీపం వెలిగించాలి': బీజేపీ నేత మంద కిరణ్ కుమార్ పిలుపు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: కావలి

కావలి పట్టణంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం ప్రతి ఇంటి వద్ద దీపం వెలిగించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ కావలి ఒకటో పట్టణ అధ్యక్షులు మంద కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు కృతజ్ఞతగా ఈ దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, 2047 వికసిత్ భారత్ లక్ష్యంలో ప్రతి కుటుంబాన్ని భాగస్వామ్యం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఆయన కావలిలో స్పష్టం చేశారు.