తక్కువ నీటితో రైతులకు అధిక దిగుబడినిచ్చే సరికొత్త మొక్కజొన్న విత్తనాలు
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
తక్కువ వర్షపాతంలోనూ మెరుగైన దిగుబడులు సాధించడానికి ఎస్బీ 459 మొక్కజొన్న విత్తనాలు ఎంతగానో దోహదపడతాయని ఎల్ఎస్ఆర్ సీడ్స్ రీజినల్ మేనేజర్ వి. రమణారెడ్డి తెలిపారు. ఖమ్మం అర్బన్ పరిధిలోని చర్లపల్లిలో రైతు శంకర్ పొలంలో నిర్వహించిన క్షేత్ర ప్రదర్శన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తక్కువ పంటకాలం, పురుగులను సమర్థంగా తట్టుకునే గుణం ఉండటంతో సాగు ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వి. కుమార్ గౌడ్, రాజశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.