పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు: రియాద్ విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

సౌదీ అరేబియా రాజధాని రియాద్పై హౌతీ రెబెల్స్ క్షిపణి దాడి నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు విమానయాన అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 10 వరకు రియాద్కు వెళ్లే, వచ్చే అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని దమామ్కు దారి మళ్లించడంతో పాటు పలు సర్వీసులను రద్దు చేసినట్లు యాజమాన్యాలు స్పష్టం చేశాయి.