పనితీరులో మేధావులైన మహిళలకు ఎదురుదవుతున్న కొత్త సమస్య: పరిశోధన వెల్లడి
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
కార్యాలయాల్లో అత్యుత్తమ మేధస్సు మరియు ప్రతిభ కనబరిచే మహిళలకు సహోద్యోగుల నుంచి ప్రతికూల వాతావరణం ఎదురవుతోందని కొత్త అధ్యయనం తేల్చిచెప్పింది. పురుషులతో పోలిస్తే ప్రతిభావంతులైన మహిళలు సామాజిక వేధింపులు, ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నారని పరిశోధకులు వెల్లడించారు. లింగ వివక్షాపూరిత ఆలోచనల వల్లే ఈ సమస్య తలెత్తుతోందని వారు స్పష్టం చేశారు.