ఓటీటీలోకి రాజ్ బీ శెట్టి 'రాక్షసపురదోల్' సినిమా

రిపోర్టర్: నరేష్ స్థలం: కర్ణాటక

ప్రముఖ నటుడు రాజ్ బీ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'రాక్షసపురదోల్' ఓటీటీలోకి వచ్చేసింది. రవి సారంగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడ భాషలో విడుదలైన ఈ చిత్రంలో మానసిక సమస్యలతో బాధపడే పోలీస్ ఆఫీసర్‌గా రాజ్ బీ శెట్టి అద్భుతంగా నటించారు.