మంచిర్యాలలో ఈ సాయంత్రం ఆర్టీసీ ఈయూ కార్మికుల భారీ విజయోత్సవ ర్యాలీ
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
ఆర్టీసీ ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ విజయం సాధించిన సందర్భంగా మంచిర్యాలలో గురువారం సాయంత్రం విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు వెల్లడించారు. ఐబీ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని, రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.