గణపతి నిమజ్జన ఏర్పాట్లతో నగరంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన ఏర్పాట్లు శుక్రవారం ఉదయం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నగరానికి వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీ చేసి బయటే నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గురువారం ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న కార్లు, బస్సులను నగరం లోపలికి అనుమతించకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.