గొల్లలపాలెంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

రిపోర్టర్: santhoshkumar స్థలం: గాజువాక

విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని గొల్లలపాలెం గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని పరిరక్షించేందుకు శ్రీకృష్ణుడు జన్మించారని తెలిపారు. గీతా సందేశం మానవాళికి ఎల్లప్పుడూ మార్గదర్శకమని పేర్కొంటూ ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.