బీర్కూర్ పాఠశాలల్లో ఘనంగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
రిపోర్టర్: రాము
స్థలం: కామారెడ్డి
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని ఉన్నత పాఠశాల, బీసీ గురుకుల పాఠశాలల్లో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని ఎంఈవో వెంకన్న కొనియాడారు. విద్యాశాఖ, పీఆర్టీయూ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సవాయిసింగ్, ఎంపీడీవో శ్రీనిధి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.