తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చిన శ్రీధర్ రెడ్డి
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఉప సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు డాక్టర్ సూర్కంటి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వారి పోరాటం స్వేచ్ఛ, ధైర్యం, ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. యువత నాటి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు.