క్రీడా కోటా ఉద్యోగాలు విద్యా ప్రవేశాలకు నైపుణ్య పరీక్ష తప్పనిసరి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అమరావతి

క్రీడా కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం ధ్రువీకరణ పత్రాల ఆధారంగా కాకుండా అభ్యర్థుల వాస్తవ ప్రతిభను నిర్ధారించేందుకు తప్పనిసరిగా నైపుణ్య పరీక్ష నిర్వహించనున్నారు. నైపుణ్యమున్న క్రీడాకారులు నష్టపోకుండా శాప్ సమగ్ర కార్యాచరణ రూపొందిస్తోండగా, త్వరలోనే పూర్తిస్థాయి విధివిధానాలతో ఉత్తర్వులు జారీ కానున్నాయి.