రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన ప్రతిభావంతులు
రిపోర్టర్: వెంకట్
స్థలం: నెల్లూరు
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లాకు చెందిన వై.శ్రీనివాసులు, జగన్నాథం రామ్మోహన్, డాక్టర్ ఎస్.రాజేశ్వరి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. తోలుబొమ్మలాట, డిజిటల్ కంటెంట్, యానిమేటెడ్ వీడియోలు మరియు వినూత్న బోధనా పద్ధతుల ద్వారా విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తూ, ప్రభుత్వ పాఠశాలలను అభ్యసన కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు. వీరి అంకితభావం, విద్యా రంగంలో చేసిన కృషికి ఈ పురస్కారాలు దక్కాయి.