స్వగ్రామం నిమ్మడలో ఓటు వేసి స్ఫూర్తినింపిన రామ్మోహన్ నాయుడు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కోటబొమ్మాళి

కోటబొమ్మాళి మండలం నిమ్మడ లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం సాయంత్రం నిమ్మడ చేరుకున్న ఆయన తన కుటుంబ సభ్యులను పలకరించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య బలోపేతానికి ఇది అత్యంత కీలకమని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.