ఢిల్లీలో ముఖర్జీ నగర్ తనిఖీ: విద్యార్థుల సమస్యలపై సీఎం రేఖా గుప్తా ఆదేశం

రిపోర్టర్: సునీల్ స్థలం: New Delhi

సివిల్ సర్వీస్ అభ్యర్థులు ఎదుర్కొంటున్న వసతి, భద్రత సమస్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ముఖర్జీ నగర్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారని సీఎం కార్యాలయం వెల్లడించింది. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్న ఆమె, అద్దె భారాన్ని తగ్గించేందుకు ప్రత్యేక పాలసీ తెస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉచిత లైబ్రరీల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.