ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై చర్యలు తీసుకోవాలని నేలకొండపల్లి పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణుల ఫిర్యాదు

రిపోర్టర్: kasanivenkatesh స్థలం: నేలకొండపల్లి

మాజీ సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు వ్యతిరేకంగా నేలకొండపల్లి పొట్టి శ్రీరాములు సెంటర్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వున్నం బ్రహ్మయ్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యేను తక్షణమే అరెస్టు చేయాలని నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేతలను దూషించడం సరికాదని, రేవంత్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని వారు ఈ సందర్భంగా తీవ్రంగా డిమాండ్ చేశారు.