నెల్లూరు నగరపాలక సంస్థలో 72 వార్డుల పునర్విభజనకు మార్గం సుగమం
రిపోర్టర్: విజయ్
స్థలం: నెల్లూరు
నెల్లూరు నగరపాలక సంస్థ వార్డుల పునర్విభజనపై హైకోర్టు కేసులు కొట్టేయడంతో 72 వార్డుల ప్రక్రియకు లైన్ క్లియర్ అయ్యింది. నగర, రూరల్ పరిధిలో చెరో 36 వార్డులుగా విభజన జరిగింది. అయితే, కొన్ని ప్రాంతాల విలీనంపై గందరగోళం నెలకొంది. నవంబర్ లోపు గెజిట్ విడుదల చేసి, ఓటర్ల జాబితా సిద్ధం చేసి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వార్డుల సరిహద్దుల మార్పుపై స్థానికంగా ఉత్కంఠ కొనసాగుతోంది.