సైఫాబాద్ పీఎస్‌లో కేటీఆర్ పీఆర్వోపై దాడి జరిగింది: హరీశ్‌రావు

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ పీఆర్వో, ఏపీ మహేశ్, మహేందర్ లపై ముసుగు ధరించి పోలీసులు దాడి చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ లీగల్ టీమ్ కేకలు వేయడంతో వారు పారిపోయారన్నారు. అయితే ఈ ఆరోపణలను సైఫాబాద్ పోలీసులు ఖండించారు. గణేష్ మండపం డీజే పర్మిషన్ కోసం వచ్చిన యువకులు వాగ్వాదానికి దిగడంతో వారిని పంపించేశామని, పోలీసుల సమక్షంలో దాడి జరిగిందన్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.