శక్తి యాప్‌తో మహిళలు చిన్నారుల భద్రతకు పెద్దపీట
రిపోర్టర్: రాజేష్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లాలో మహిళలు మరియు చిన్నారుల భద్రత కోసం అనంతపురం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు మహిళా పోలీసులు మరియు శక్తి టీమ్‌లు ప్రజల మధ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మొబైళ్లలో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేయిస్తూ, ఆపద సమయంలో ఈ యాప్ ద్వారా తక్షణ రక్షణ పొందవచ్చని వివరిస్తున్నారు. ఈ భద్రతా చర్యలపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.