అజ్నార్ నది ప్రక్షాళన కోసం సాహసం: చర్మవ్యాధుల బారిన పడ్డ యువకుడు
రిపోర్టర్: హరి
స్థలం: Madhya Pradesh
మధ్యప్రదేశ్ లోని అజ్నార్ నదిని ఒంటరిగా శుభ్రం చేస్తున్న సురేంద్ర సింగ్ చౌదరి తీవ్ర చర్మ సమస్యలతో బాధపడుతున్నట్లు మీడియా వెల్లడించింది. నదిలోని కలుషిత నీటి కారణంగా చేతులు, కాళ్ళలో నిరంతరం దురద, నొప్పి వస్తున్నాయని బిట్టు తబాహి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ రాత్రి మందులు వేసుకుని ఉదయాన్నే మళ్లీ నది శుభ్రత పనులకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. నది మళ్లీ చెత్తాచెదారంతో నిండిపోకుండా తన పోరాటాన్ని ఆపబోనని స్పష్టం చేశారు.