అమెరికాలో సంచలనం: లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో దూసుకుపోతున్న ఎన్నారై నిత్యా రామన్
రిపోర్టర్: మహేష్
స్థలం: లాస్ ఏంజిల్స్
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ మేయర్ పదవికి జరుగుతున్న ఎన్నికల్లో భారత సంతకు చెందిన ఎన్నారై నిత్యా రామన్ గట్టి పోటీ ఇస్తున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రస్తుత మేయర్ కరెన్ బాస్‌తో జరిగిన ముఖాముఖి చర్చలో ఆమె పోలీసుల తీరును, ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ దాడులను తీవ్రంగా ఎండగట్టారు. తాను గెలిస్తే ఈ పదవి చేపట్టనున్న తొలి దక్షిణాసియా మహిళగా చరిత్ర సృష్టిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.