స్టిక్కర్ మార్చకుండానే ఫాస్టాగ్ బ్యాంక్ మార్చేయవచ్చు

రిపోర్టర్: నరేష్ స్థలం: India

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు ఊరటనిస్తూ 'వన్‌ట్యాగ్' పోర్టబిలిటీ విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై ఫాస్టాగ్ స్టిక్కర్ మార్చకుండానే, పాత నంబర్లతోనే నచ్చిన మరో బ్యాంకుకు ఫాస్టాగ్ సేవలను మార్చుకోవచ్చు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ కొత్త సేవలను ప్రారంభించారు. 'రాజ్‌మార్గ్‌యాత్ర' యాప్ ద్వారా ఈ పోర్టింగ్ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకోవచ్చు.