వైద్యుల వద్ద అనారోగ్య లక్షణాలు కల్పించి యాంటీబయాటిక్స్ పొందుతున్న రోగులు

రిపోర్టర్: నరేష్ స్థలం: అమెరికా

యాంటీబయాటిక్స్ మందుల కోసం నూతన అమెరికా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయని పరిశోధకులు తెలిపారు. జమా నెట్వర్క్ ఓపెన్ పత్రికలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం నలుగురిలో ఒకరు తమ అనారోగ్య లక్షణాలను ఎక్కువగా చూపించి లేదా కల్పించి మందులు తీసుకుంటున్నారని తేలింది. త్వరగా కోలుకోవాలనే ఉద్దేశంతోనే ఎక్కువ మంది ఇలా తప్పుడు లక్షణాలు చెబుతున్నారని యూనివర్సిటీ ఆఫ్ ఉటా హెల్త్ పరిశోధకుడు అలిస్టర్ థోర్ప్ పేర్కొన్నారు.