అనంత్ అంబానీకి ప్రొఫెసర్షిప్ గౌరవం అందించిన న్యూకాజిల్ యూనివర్సిటీ
రిపోర్టర్: నరేష్
స్థలం: తెలంగాణ
వన్యప్రాణుల సంరక్షణ, హరిత ఇంధన మార్పులో విశేష కృషి చేసిన అనంత్ అంబానీకి బ్రిటన్లోని ప్రఖ్యాత న్యూకాజిల్ యూనివర్సిటీ ప్రొఫెసర్షిప్ ఆఫ్ ప్రాక్టీస్ గౌరవాన్ని ప్రదానం చేసినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. గుజరాత్లోని జామ్నగర్లో వంతారా పేరుతో ఆయన ఏర్పాటు చేసిన వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ద్వారా అంతరించిపోతున్న మూగజీవాలను కాపాడేందుకు చేస్తున్న సేవలను విశ్వవిద్యాలయం కొనియాడింది. ఈ మేరకు యూనివర్సిటీ ఛాన్సలర్ ఇంతియాజ్ ధార్కర్ సమక్షంలో ఈ అత్యున్నత గౌరవాన్ని అధికారికంగా అందజేసినట్లు వెల్లడించారు.