జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ఏకగ్రీవ నాయకత్వ ఎంపిక

రిపోర్టర్: KISHORE M స్థలం: ఆదోని

ఆదోనిలో రాష్ట్ర, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆదోని అధ్యక్షుడిగా చంద్రమోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే జిల్లా సహాయ కార్యదర్శిగా ప్రజాశక్తి రిపోర్టర్ మునెప్ప ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, సహాయ కార్యదర్శులకు పలువురు ఘనంగా అభినందనలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా నూతన నాయకులు స్పష్టం చేశారు.