శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు
రిపోర్టర్: గోపి
స్థలం: తిరుమల
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా చిన్నారులు, వృద్ధుల భద్రత కోసం తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రద్దీలో తప్పిపోయే అవకాశమున్న భక్తుల కోసం ప్రత్యేకంగా బయో ట్యాగ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అమలు చేస్తున్నారు.