హైదరాబాద్‌లో బరితెగింపు: నకిలీ హిజ్రాలుగా మారి బీఎండబ్ల్యూ కారు యజమానిని బెదిరించి వసూళ్లకు పాల్పడిన నలుగురు వ్యక్తుల అరెస్ట్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Hyderabad
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నకిలీ హిజ్రాల వేషధారణలో బీఎండబ్ల్యూ కారు యజమానిని అడ్డగించి ఐదు వేల రూపాయలు వసూలు చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ డి. అశోక్ తెలిపారు. బోడుప్పల్‌కు చెందిన యాదగిరి, సత్యనారాయణ, కె. రమేష్, ఎస్. రమేష్‌లను సీసీటీవీ టేజ్ ఆధారంగా అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు.