బొబ్బిలిలో భారీ వర్షాన్ని సైతం లెక్కచేయక కాంగ్రెస్ అభ్యర్థి మువ్వల పద్మావతి ఎన్నికల ప్రచారం

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలిలో అర్నాద్ తుఫాన్ కారణంగా పడుతున్న వర్షాన్ని కూడా లెక్కచేయకుండా కాంగ్రెస్ పార్టీ పురపాలక సంఘ చైర్పర్సన్ అభ్యర్థి మువ్వల పద్మావతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక గొల్లపల్లి, నాయుడు కాలనీ ప్రాంతాల్లో హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మువ్వల శ్రీనివాసరావు సహా పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.