వైష్ణవి హత్యకు ప్రతీకారంగా హరిబాబును హతమార్చిన సంతోష్ అరెస్ట్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: నిజామాబాద్

నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ప్రతీకార హత్య కలకలం రేపింది. భార్య వైష్ణవిని హత్య చేసి బెయిల్‌పై బయటకు వచ్చిన చిత్తరి హరిబాబును ఆమె సోదరుడు గంధం సంతోష్ కత్తితో దారుణంగా హతమార్చాడు. అనంతరం సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి పరారయ్యాడు. నిందితుడిని విశాఖపట్నం పారిపోయేందుకు యత్నిస్తుండగా నిజామాబాద్ బైపాస్ సమీపంలో నాలుగు ప్రత్యేక బృందాలతో పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు సహకరించిన మిగతా నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.