సచివారయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ కీలక సమావేశం
రిపోర్టర్: సతీష్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి హాజరైనట్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు ప్రాంత నేత ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు పలు కీలక విధాన నిర్ణయాలపై మంత్రివర్గ సహచరులు అలాగే అధికారులతో కలిసి విస్తృతంగా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశం ద్వారా రాష్ట్రంలో అమలు చేయాల్సిన వివిధ కీలక అంశాలపై ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం.