రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
రిపోర్టర్: రమేష్
స్థలం: రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లోని గురునానక్ యూనివర్సిటీతో పాటు సీవీఆర్, శ్రీ ఇందు ఇంజినీరింగ్ కళాశాలల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం ఉదయం నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల వాస్తవ సంఖ్య, కళాశాల రికార్డులు, ప్రవేశాల వివరాలు, ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లకు సంబంధించిన డాటాను అధికారులు అత్యంత రహస్యంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.