తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ ఎన్ రామచందర్ రావు ఆగ్రహం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Telangana

జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న రైతులను కలిసేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావును జడ్చర్లలో పోలీసులు అరెస్ట్ చేశారు. రైతుల సమస్యలపై గళం ఎత్తకుండా భయభ్రాంతులకు గురిచేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.