అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సోషల్ మీడియా పోస్ట్ వివాదం

రిపోర్టర్: వెంకట్ స్థలం: USA

అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ శాఖ చేసిన సోషల్ మీడియా పోస్ట్ సిక్కులను కించపరిచేలా ఉందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. 'సింగ్' అనే పేరును లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ జాతి వివక్షాపూరిత పోస్ట్ పై సిక్కు, హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. వెంటనే ఈ చర్యను ఖండించిన నేతలు, ఫెడరల్ ఏజెన్సీపై తక్షణ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.