హైదరాబాద్ వ్యాపారుల లెదర్ రవాణాను తక్షణమే పునరుద్ధరించాలి: అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్కు చెందిన వ్యాపారుల లెదర్ వస్తువుల రవాణాను నిలిపివేయడంపై ఏఐఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒడిశా ప్రభుత్వం జోక్యం చేసుకుని నిలిపివేసిన రవాణాను వెంటనే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టబద్ధమైన వ్యాపారాలకు అడ్డంకులు సృష్టించడం పూర్తిగా అన్యాయమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోరారు.