అమెరికా ఉద్యోగాలకు గుడ్ బై: నాలుగు కోట్ల సంపదతో భారత్కు దంపతులు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
అమెరికాలో ఉద్యోగ ఒత్తిడి భరించలేక ముప్పై ఏళ్ల వయసున్న దంపతులు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యారు. తమ వద్ద రూ.4.78 కోట్ల సంపద ఉందని, భారత్లో ప్రశాంత జీవితాన్ని గడపాలని యోచిస్తున్నట్లు ఆ దంపతులు రెడిట్ వేదికగా వెల్లడించారు. భవిష్యత్తులో పిల్లల పెంపకం, జీవన వ్యయాలపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు.