సింగరేణి కార్మికులకు దీపావళి కానుక: నవంబర్ ఐదున బోనస్ జమ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తెలంగాణ
సింగరేణి కాలరీస్ కంపెనీ కార్మికులకు దీపావళి బోనస్ కింద మొత్తం 419 కోట్ల రూపాయలను కేటాయించినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ నిధులను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా వచ్చే నెల 5వ తేదీన నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 38 వేల మంది ఎన్సీడబ్ల్యూఏ కార్మికులకు ప్రత్యక్షంగా భారీ లబ్ధి చేకూరనుందని ఆయన స్పష్టం చేశారు.