భోపాల్లో రిటైర్డ్ ఐఏఎస్ రాకేష్ అగర్వాల్ దారుణ హత్య

రిపోర్టర్: గోపి స్థలం: Bhopal

భోపాల్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాకేష్ అగర్వాల్ హత్య కలకలం సృష్టించింది. తెల్లవారుజామున తన బెడ్రూమ్ బయటి నుంచి లాక్ చేసి ఉండటంతో అనుమానం వచ్చిందని మృతుడి భార్య నిషి పోలీసులకు తెలిపారు. వంటమనిషి అమర్ ఇచ్చిన సమాచారంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిందని ఏసీపీ అంకితా ఖటార్కర్ వెల్లడించారు. ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పైపులను తొలగించి ప్రమాదం సృష్టించేందుకు యత్నించినట్లు పోలీసులు గుర్తించి, పరారీలో ఉన్న కేర్టేకర్ కోసం గాలిస్తున్నారు.