తీవ్ర దశలో ఎల్నినో: వచ్చే ఏడాది మే వరకు వాతావరణంలో మార్పులు
రిపోర్టర్: హరి
స్థలం: విశాఖపట్నం
ఎల్నినో ప్రస్తుతం తీవ్ర దశకు చేరుకుందని, దీనివల్ల భూగోళం ఎన్నడూ లేనంతగా వేడిగా మారిపోయిందని ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణ విభాగం ప్రొఫెసర్ పి.సునీత తెలిపారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం వల్లే వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని ఆమె స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావం వచ్చే ఏడాది జనవరి వరకు ఉంటుందని, ఏప్రిల్ లేదా మే నాటికి మాత్రమే సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వివరించారు.