అమెరికా రాజకీయాల్ లో కలకలం: ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సెనేటర్ క్రిస్ మర్ఫీ

రిపోర్టర్: గోపి స్థలం: Washington

అమెరికా రాజకీయ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తూ ప్రముఖ డెమొక్రాట్ సెనేటర్ క్రిస్ మర్ఫీ ఆసుపత్రిలో చేరినట్లు ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ అల్లిసన్ హెర్విట్ తెలిపారు. కుమారుడి హాకీ మ్యాచ్ చూస్తున్న సమయంలో చేతిలో తిమ్మిరి రావడంతో ఆయన్ను వెంటనే జాన్స్ హాప్కిన్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారని, ఆయన కోలుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న తరుణంలో ఈ ఆరోగ్య సమస్య తలెత్తింది.