సోషల్ మీడియా మేనేజర్‌కు షాక్: యాభై వేల రూపాయల ఫీజు ఎత్తివేత
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
ఒక భారతీయ మహిళా ఫౌండర్ తన సోషల్ మీడియా ప్రొఫైల్ నిర్వహణ కోసం మూడు నెలల ఒప్పందం కుదుర్చుకుని, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మధ్యలో నిలిపివేసి యాభై వేల రూపాయల ఫీజు ఎగవేసినట్లు ఫ్రీలాన్సర్ కృపా కోటెచా ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ తనను బ్లాక్ చేశారని సోషల్ మీడియా వేదికగా ఆమె వాపోయారు.