ఆటోలో షూటింగ్ లొకేషన్‌కు వచ్చి ఆశ్చర్యపరిచిన సూపర్ స్టార్ రజినీకాంత్
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
సూపర్ స్టార్ రజినీకాంత్ తన సింప్లిసిటీతో మరోసారి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ధర్మన్ సినిమా షూటింగ్ లొకేషన్‌కు ఆయన ఆటోలో వచ్చారు. అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ధర్మన్ మూవీ షూటింగ్ మైసూర్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ కోసం లొకేషన్‌కు కారుకు బదులుగా ఆయన ఆటోలో వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు. రజినీ సింపుల్ జర్నీని ఫ్యాన్స్ వీడియో తీసి నెట్టింట వైరల్ చేస్తున్నారు.