మొగళ్లూరు ఎంపీటీసీ ఎన్నికల బరిలో తలపడుతున్న ఇద్దరు తోడికోడళ్లు
రిపోర్టర్: AHMED
స్థలం: పొదలకూరు
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని మొగళ్లూరు ఎంపీటీసీ స్థానంలో ఆసక్తికరమైన ఎన్నికల పోటీ నెలకొంది. ఎస్సీ మహిళకు కేటాయించిన ఈ స్థానంలో టీడీపీ తరఫున కూకట్ల శంకరమ్మ, వైసీపీ అభ్యర్థిగా ఆమె తోడికోడలు కూకట్ల ఉష బరిలో నిలిచారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రత్యర్థి పార్టీల నుంచి పోటీ పడుతుండటంతో ఈ స్థానికంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.