అర్హులైన నిరుపేదల ఆశలకు ఊపిరిపోసే పింఛన్ల గడువు పొడిగింపు
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి అర్బన్
ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు రోజుల పాటు పొడిగించిందని తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల పదహారవ తేదీతో ముగియాల్సిన గడువును దరఖాస్తుదారుల సౌకర్యార్థం ఈ నెల పద్దెనిమిదో తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగి ఉండి ఇంకా దరఖాస్తు చేసుకోని నిరుపేద లబ్ధిదారులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజా ప్రయోజనం దృష్ట్యా స్థానిక ప్రజలు సమాచారాన్ని మిగతా వారికి వెంటనే తెలియజేయాలని ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.