భక్తిశ్రద్ధలతో కొలువుదీరిన పల్లెసీమల వినాయక గణనాథులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఆత్మకూరు(ఎం)
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు(ఎం) మండలంలో ని పలు గ్రామాల్లో గణనాథులు ఘనంగా కొలువుదీరారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేసిన నిర్వాహకులు వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో మండపాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలుచోట్ల భక్తుల కోసం అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో ఆయా ప్రాంతాల్లో పండుగ సందడి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.