బెంగళూరు జైలులో సంచలనం: ఖైదీ భార్యను వేధించిన డిఐజి సోమశేఖర్ అరెస్ట్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Bengaluru
జీవిత ఖైదీ విడుదల కోసం ప్రయత్నిస్తానని చెప్పి అతని భార్యను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జైళ్ల శాఖ డిఐజి సోమశేఖర్‌ను పరప్పన అగ్రహార పోలీసులు అరెస్టు చేశారు. 2018లో నకిలీ సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఖైదీ శంకర్ విడుదలైన ఉదంతంపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులకు బాధితురాలు ఈ దారుణమైన ఫిర్యాదు చేశారు. విచారణకు సహకరించకపోవడంతో పాటు సమాచారాన్ని దాచిపెట్టారన్న ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు.