'రైతుల సమస్యల పరిష్కారానికే జీవితం అంకితం': సారంపల్లి మల్లారెడ్డిని కొనియాడిన సీఎం రేవంత్
రిపోర్టర్: రమేష్
స్థలం: Hyderabad
ఆరు దశాబ్దాల పాటు గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం సారంపల్లి మల్లారెడ్డి తన జీవితాన్ని ధారపోశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. రవీంద్రభారతిలో నిర్వహించిన అఖిల భారత కిసాన్ సభ కార్యక్రమంలో ఆయన మల్లారెడ్డి సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.