ఇందిరమ్మ కుట్టుమిషన్ పథకానికి పోటెత్తిన బీసీ మహిళల దరఖాస్తులు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో ఇందిరమ్మ కుట్టుమిషన్ పథకానికి భారీ స్పందన లభిస్తోంది. బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే ఈ పథకం దరఖాస్తుల గడువు ఈనెల 15తో ముగియనుంది. ఇప్పటివరకు 2.90 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. తొలి విడతలో 1.19 లక్షల మంది మహిళలకు నూటికి నూరు శాతం సబ్సిడీపై ఉచితంగా కుట్టుమిషన్లు అందజేయనున్నారు. దరఖాస్తుల పరిశీలన తరువాత కలెక్టర్ నేతృత్వంలో తుది లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.