తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: అక్టోబర్ చివరి నాటికి హెచ్చరిక జారీ

రిపోర్టర్: సతీష్ స్థలం: Andhra Pradesh / Telangana

అక్టోబర్ చివరి నాటికి తుఫాను ఏర్పడే అవకాశం ఉందని స్కైమెట్ వెదర్ (Skymet Weather - వ్యవసాయ వాతావరణ అంచనాలు & వర్షపాతం) వెల్లడించింది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా సాకూల పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు అన్నదాతలు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.