గురుకుల విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి.. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విద్యార్థి సంఘాల నిరసన

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రఘునాథపాలెం

రఘునాథపాలెం మండలంలోని మహాత్మాజ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థి సాత్విక్ మృతి చెందడంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. గురుకుల ఆర్సీవో రాంబాబును తక్షణమే సస్పెండ్ చేయాలని, మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం తరఫున తగిన నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని వారు తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు.