సోషల్ మీడియా వీడియోల కోసం ప్రాణాలు పణంగా పెట్టొద్దని వరంగల్ పోలీసుల హెచ్చరిక

రిపోర్టర్: మహేష్ స్థలం: హన్మకొండ

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల కోసం యువత ప్రాణాలను పణంగా పెట్టొద్దని వరంగల్ పోలీస్ శాఖ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వీడియోలు పెట్టే క్రమంలో ప్రాణాల భద్రతకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వైరల్ కావాలనే తపనతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వరంగల్ పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. ఒక్క క్షణం చేసే నిర్లక్ష్యం జీవితాంతం పశ్చాత్తాపంగా మిగులుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణాలను రిస్క్ లో పెట్టే విన్యోసాలు, రీల్స్ చేయరాదని సూచించారు.